Saturday, 7 November 2026

ఏకమైన ఇద్దరు నారాయణలు

లోక్‌సత్తాలో చేరిన మాజీ జెడి లక్ష్మీనారాయణ

ప్రజల కోసం జయప్రకాశ్‌తో కలసి నడుస్తానని వెల్లడి

హైదరాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తానే బాణాలు వదలబోతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ అన్నారు. లక్ష్మీనారాయణ సోమవారం లోక్‌సత్తా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రజల ఆలోచన మేరకే తాను పీపుల్స్‌ మేనిఫెస్టో రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. లోక్‌సత్తాలో చేరాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ కోరారని, దీంతో ఆ పార్టీలో చేరినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెడుతారని, లేని పక్షంలో బిజెపి , టిడిపి, జనసేనలో చేరుతారని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆయన లోక్‌సత్తాలో చేరడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. లోక్‌సత్తా పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన స్పష్టం చేశారు. నవ నిర్మాణ దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని పరోక్షంగా బాబుపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. తమ పార్టీలో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. తమ విధానాలు నచ్చి వస్తే ఎవరితోనైనా పనిచేయటానికి సిద్ధమన్నారు. ముందస్తు ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమేవిూ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు విస్తృతస్థాయిలో ఏదైనా మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావడమే మార్గమని భావించి వచ్చానని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మధ్య కాలంలో పీపుల్స్‌ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. తమ గ్రామానికి ఏం కావాలనే దానిపై అక్కడి ప్రజలే నిర్ణయించుకుని ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ సమస్యలను స్టాంపు పేపర్‌పై రాయించి అభ్యర్థులతో సంతకాలు పెట్టించుకోవాలన్న ఉద్యమాన్ని మొదలు పెట్టామన్నారు. దాన్నే పీపుల్స్‌ మేనిఫెస్టోగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఈ పీపుల్స్‌ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులు ఇస్తున్న హావిూలను స్టాంపు పేపర్‌పై రాసి సంతకం చేయాల్సిందిగా అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధికల్పన, మహిళా సాధికారత, యువతరంలో చైతన్యం, జీరో బ్జడెట్‌ పాలిటిక్స్‌ను తన విధివిధానాలుగా గతంలో ప్రకటించానని చెప్పారు. అలాంటి విధివిధానాలు, సమాలోచనలతో ఉన్నవారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని, తనను కొన్ని పార్టీల నేతలు ఆహ్వానించారు తప్ప.. విధివిధానాలపై ఎవరూ మాట్లాడలేదన్నారు. అందుకే స్వతంత్రంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సమాలోచనలు కలిగిన తన మిత్రులతో ఈరోజు సమావేశమై తన విధివిధానాలను మరోసారి వివరించినట్లు తెలిపారు. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై వారితో చర్చిస్తుండగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ అక్కడికి వచ్చి ఆ పార్టీ బాధ్యతలు చేపట్టాలని ఆహ్వానించారని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆయనతో పాటు తెలంగాణ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్‌, ఆమ్‌ ఆద్మీకి చెందిన పోతిన రామారావు తదితరులు ముందుకొచ్చి కలిసి నడుద్దామన్న భరోసా ఇచ్చారని వివరించారు. తాను ఏవిధంగా ప్రజా జీవితంలోకి వస్తాననే విషయంపై అతి త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. జయప్రకాశ్‌ నారాయణ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని

లక్ష్మీనారాయణ తెలిపారు.