Wednesday, 4 November 2026

ఏపీకి నలుగురు యువ ఐపీఎస్‌ అధికారుల కేటాయింపు

అమరావతి,జూలై9(జనంసాక్షి): ఏపీకి కేంద్ర హోంశాఖ నలుగురు యువ ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. యూపీఎస్‌పీ `2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష(ఢల్లీి), సీహెచ్‌. యశ్వంత్‌కుమార్‌ రెడ్డి(ఏపీ), ఎస్‌. అంకిత మహవీర్‌ (మహరాష్ట్ర), నవ్‌ జ్యోతి మిశ్రా(బిహార్‌)లను ఏపీ కేడర్‌కు అటాచ్‌ చేసింది. ఈ నలుగురు యువ అధికారులు హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడవిూలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు.