– ఏపీని అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
– అందుకే తెదేపాలో చేరా
– రఘురామ కృష్ణంరాజు
హైదరాబాద్, మే5(జనం సాక్షి ) : విభజనతో నష్టపోయిన ఆంధప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలంటే.. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే సమర్థుడని రఘురామ కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ అభివృద్దిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆయనతో కలవాలని హైదరాబాద్‌లో పిలుపునిచ్చారు. భాజపా అనుకున్నంత స్థాయిలో న్యాయం చేయడంలేదన్నారు. బీజేపీలో ఉండి ప్రత్యేక ¬దా సాధించడం కష్టమని, అందుకే తాను తెదేపాలో చేరినట్లు స్పష్టం చేశారు. మాటలే కాదు చేతల్లోనూ చంద్రబాబు పనితనం కనిపించిందన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆంధప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని వివరించారు. రాష్ట్రంలో వృద్ధిరేటు దేశం కంటే మెరుగ్గా ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని హావిూలను కేంద్రం అమలు చేస్తుందని భావించామని, కానీ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వటంలోనూ, విభజన చట్టంలోని హావిూలను అమలు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రత్యేక ¬దాకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్లెక్కినా, పార్లమెంట్‌ను ఎంపీలు స్తంభింపజేసినా ఏపీకి గురించి ఆలోచించక పోవటం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీసైతం ప్రత్యేక ¬దా సాధించటంలో బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టగలిగే వ్యక్తి ఒక్క చంద్రబాబేనని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
ఏపీకి భాజపా న్యాయం చేయలేక పోయింది




