ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ కార్యకర్తల ఛలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. వేతనాలు పెంచాలంటూ ఏపీ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సుందరయ్య పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లడానికి చూసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు మహిళలని కూడా చూడకుండా కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వాహనాల్లోకి ఎక్కించే సందర్భంగా పలువురు అంగన్ వాడీలు గాయపడ్డారు.
ఏపీ అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం




