Tuesday, 3 November 2026

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

9kga34tnహైదరాబాద్‌, మార్చి 25 : ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉభయగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో, గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ గుంటూరులోని సెయింట్‌ జోసెఫ్‌ బీఈడీ కాలేజీలో జరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ కౌంటింగ్‌ హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ నల్గొండలోని ఎన్‌జీ కళాశాలలో మొదలైంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్‌ ఓటింగ్‌ కావడంతో రాత్రి వరకు కానీ ఫలితాలు పూర్తి స్థాయిలో తేలే అవకాశంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *