Friday, 6 November 2026

ఏప్రిల్ నుంచి విమానయాన రంగంలోకి

 

విమానయాన రంగంలోకి అడుగు పెడుతున్నట్లు గతంలోప్రకటించిన యువహీరో రామ్ చరణ్ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీజీసీఏ నుంచి ఆరు సంస్థలకు అనుమతులు లభించగా దాంట్లో చెర్రీకి చెందిన టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ తొలి వారం నుంచి సంస్థ విమానాలు రన్వేపై దూసుకుపోనున్నట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ తెలిపారు. 72 సీట్ల సామర్థ్యంతో కూడిన విమానాన్ని తొలుత హైదరాబాద్ తో పాటు తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, ఔరంగాబాద్ రూట్లలో నడుపనున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *