ఐటి దాడులు జరగలేదన్న జ్యోతుల
కాకినాడ,మే23( జనం సాక్షి): మా ఇంట్లో ఐటీ శాఖ సోదాలు జరిపితే అప్పుల పత్రాలు తప్ప మరేవిూ బయటపడవని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తెలిపారు. ఐటి దాడుల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. రెండు రోజులుగా ఐటీ శాఖ అధికారులు మా ఇంటిని ఉద్దేశించి సోదాలు నిర్వహించలేదు. గతంలో మాకు చెందిన ఒక గోదామును చంటిబాబుకు విక్రయించాను. అనంతరం ఆ గోదాము మరో వ్యక్తికి వారు విక్రయించారు. ఆ ఆస్తిని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో తాము విక్రయించిన ఈ ఆస్తికి సంబంధించిన వివరాలను అధికారులు అడిగారు . ఇంతకు మించి ఈ దాడులు వెనుక వేరే సంచలన అంశం మరేదీ లేదన్నారు.