Monday, 2 November 2026

ఐటీలో బెంగళూరుకు అండగా హైదరాబాద్

hyderabad-tourist-attractionsఐటీ రంగంలో హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఆపత్కాలంలో అండగా హైటెక్ సిటీ అండగా ఉంటుందన్న పేరును మరోసారి నిలబెట్టుకుంది. గతంలో వరదల సమయంలో చెన్నై ఐటీని నిలబెట్టిన హైదరాబాద్ నగరం…ఈ సారి బెంగళూరు ఐటీ కంపెనీలకు ఆసరా అయ్యింది. కావేరీ జలాల వివాదంతో బెంగళూరులో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వీకెండ్ తర్వాత వరుసగా మూడు రోజులు బెంగళూరులోని ఐటీ సంస్థలు మూతపడ్డాయి. దేశానికి ఐటీ రాజధానిగా ఉండే అక్కడ వివిధ దేశాలకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులను  దాదాపు 90 వేల మంది టెకీలు డీల్ చేస్తుంటారు. ఈ వివాదాల కారణంగా ఆ బాధ్యతలను తీసుకున్న హైదరాబాద్  సాప్ట్ వేర్ ఉద్యోగులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేసి కీలక సేవలు ఆగిపోకుండా నిలబెట్టారు. సోమ, మంగళ వారాల్లో  చాలా మంది ఆఫీసులోనే ఉందిపోయారు. బెంగళూరులో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసేందుకు హైదరాబాద్ లో 25 వేల మంది టెకీలు కష్టించారు.

విపత్తుల కారణంగా ప్రాజెక్టులు ఆగనీయకుండా ఎంఎన్ సీలు ప్రత్యామ్నాయంపై ద్రుష్టి సారిస్తాయి. దీని కోసం రెండో కేంద్రంగా సర్వర్లను వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటాయి. మన దేశంలో అటువంటి కార్యకలాపాలకు హైదరాద్ ను కేంద్రంగా ఎక్కుగా ఎంచుకుంటారు ఆయా కంపెనీల నిర్వాహకులు. ఐటీ సంస్థల్లో 70 శాతం కంపెనీలు హైదరాబాద్ నే రెండో ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నారు. భౌగోళికంగా నగరం సేఫ్ జోన్ లో ఉండటమే దీనికి మరో కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *