Monday, 2 November 2026

ఐటీ దాడులు జరిగితే సీఎంకు ఉలుకెందుకు?

– వారంతా విూకు బినావిూలేనా?
– కడప ఉక్కు పరిశ్రమ విషయంలో రాజకీయం మానుకోవాలి
– సరైన రిపోర్టు ఇవ్వకపోవటం వల్లే ఉక్కుపరిశ్రమ ఆలస్యం
– రెండో బ్రహ్మం శివాజి చెప్పినట్లు బాబు నడుచుకుంటున్నాడు
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌
కడప, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. బుధవారం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కడప నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జీవీఎల్‌ ప్రారంభించారు. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కందుల రాజమోహన్‌ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలుసని జీవీఎల్‌ అన్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చిన్నచిన్న పార్టీలు సైతం పిలిస్తే ఢిల్లీకి వెళ్తారా అని ప్రశ్నించారు. ఐటీ దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు. అంటే వారంతా విూకు బినావిూలుగా అంగీకరించినట్లేనా అని జీవీఎల్‌ ప్రశ్నించారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులుగా చేసినా ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను విస్మరించారని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, దొంగ దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుతో రాజకీయ పార్టీలను దగ్గర చేసుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం చెందడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో తెలుగుదేశానికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జీవీఎల్‌ జోస్యం చెప్పారు. దీక్షల పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో విూటింగ్‌లు పెట్టడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవని చెప్పారు. ప్రభుత్వం సరైన రిపోర్ట్‌ ఇవ్వకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ ఆలస్యం అవుతుందని వివరించారు. ఇకనైనా చంద్రబాబు సొంత స్కిప్టుల్రు రాసుకోవడం మానుకోవాలని సూచించారు. రెండో బ్రహ్మం శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.