Tuesday, 3 November 2026

ఐదు లక్షల మందికి సరిపడ చేప ప్రసాదం

vlcsnap-2016-06-07-15h45m23s95చేప ప్రసాదం కోసం హైదరాబాద్, తెలంగాణ జిల్లాల వాసులు రేపు మధ్యాహ్నం తర్వాత రావాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారని, కాబట్టి స్థానికులు కొంచెం ఆలస్యంగా రావాలని సూచించారు. చేప ప్రసాదం అయిపోతుందన్న భయం అవసరం లేదని, ఐదు లక్షల మందికి సరిపడ అందుబాటులో ఉందని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వచ్చే ప్రతి అస్తమా రోగికి చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ తెలిపారు. 1500 మంది పోలీసులు, 1100 మంది వలంటీర్లతో బందోబస్తు కల్పించామన్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8.30 వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారని, ఇందుకోసం 32 కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు.
హైదరాబాద్ కు చెందిన బత్తిన సోదరులు మృగశిర కార్తె ప్రారంభం రోజున అస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *