Tuesday, 3 November 2026

ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షకోట్లు: కిషన్‌రెడ్డి

కరీంనగర్‌: వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు లక్షకోట్ల రూపాయలు రానున్నట్టు బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరకపోతే నిధులు ఇవ్వబోమని ఇతర పార్టీల సర్పంచ్‌లు, ఎంపీపీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. వేధింపులను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇసుక మాఫియా, సారా మాఫియాలో టీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో విచిత్రమైన అద్భుత పాలన జరుగుతోందని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *