![]() |
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్ యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఓ యువతిపై నలుగురు యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను వాట్సప్ పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి సామాజిక కార్యకర్త సునీతాకృష్ణన్ నిందితులను గుర్తుపట్టేలా వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. గత పదిహేను రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సైతం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. అనంతరం పోలీసులు యూట్యూబ్‌లో నుంచి వీడియోను తొలగించారు.
హైదరాబాద్ పోలీసులు సైతం ఈకేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం నిందితులను పట్టుకోవాలంటూ ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు రంగంలోకి దిగనున్నాయి.





