- న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో చేపట్టిన నిరసన ఐదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాధికారుల సమ్మె కు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ ఇద్దరు మంత్రివర్గ సహచరులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో బైఠాయించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వోద్యోగుల సమ్మెను లెఫ్టినెంట్ గవర్నర్ విరమింప చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
ఐదో రోజూ చేరుకున్న కేజ్రీవాల్ నిరసన




