ఐయామ్స్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ ప్రవేశ పెట్టిన మార్స్ పెట్ కేర్
ఖైరతాబాద్ : జూన్ 03 (జనం సాక్షి) ప్రపంచపు అగ్రగామి పెట్ ఫుడ్ కంపెనీ అయిన మార్స్ పెట్ కేర్ నేడిక్కడ భారత దేశంలో ప్రీమియం క్యాట్ ఫుడ్ ను ఐయామ్స్ బ్రాండ్ కింద ప్రవేశపెట్టింది. ఐయామ్స్ ప్రీమియం శ్రేణి భారత దేశంలో నాలుగు రకాలను అందిస్తుంది. పెద్ద పిల్లులు ఏడాదికిపైగా వయస్సు, అడల్ట్స్ పిల్లలు 2 నుంచి 12 నెలలు కిటెన్స్ కోసం ఆరోగ్యదాయకంగా, సహజ రక్షణకు వీలు కల్పించేలా ప్రత్యే కంగా ఇది రూపొందించబడింది. స్విగ్గీ, డుంజీ వంటి ఇ – కామర్స్ తో పాటుగా పెట్సీ, హెడ్స్ అప్ ఫర్ టెయి ల్స్ , షేక్ హ్యాండ్ వంటి స్పెషాలిటీ పెట్ స్టోర్స్ లో ఈ ఉత్పాదనలు లభ్యమవుతాయి. ఐయామ్స్ క్యాట్ ఫుడ్ అనేది పశువైద్యులతో కలసి అభివృద్ధి చేయబడింది. ఈ సందర్భంగా మార్స్ పెట్ కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ మూర్తి మాట్లాడుతూ తయారైన పెట్ ఫుడ్ ను పెంపుడు జంతువులకు సంపూర్ణ పోషకాహారంగా ఆమోదించడం అనేది భారతదేశంలో అధికమ వుతోందన్నారు. వీటిని పెంచుకునే వారు వాటి పోషక అవసరాల గురించి మరింతగా తెలుసుకుంటున్నారన్నారు. ఐ యామ్స్ అనేది 2019 లో సరైన పోషక పరిష్కారాల ద్వారా భారతదేశంలో పెంపుడు జంతువుల యజ మానుల అవసరాలను తీర్చేందుకు ఆవిష్కరించబడిందన్నారు. ఇన్నేళ్లుగా ఇది మార్స్ పెట్ కేర్ లో విజయవం తమైన ప్రీమియం బ్రాండ్ గా ఉంటోందన్నారు. ఇప్పుడు ఇది భారతదేశంలో క్యాట్ ఫుడ్ రకాలతో బ్రాండ్ పోర్ట్ ఫోలియోను మరింత పటిష్ఠం చేసుకుందని అన్నారు.