Monday, 2 November 2026

పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి._ *_•మండల ప్రత్యేక అధికారి కోటయ్య._*

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని మండల ప్రత్యేక అధికారి కోటయ్య పేర్కొన్నారు. పల్లె ప్రగతి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా అయన దోమ మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామసభలో ఎంపీడీఓ జయరాంతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా పదిహేను రోజులపాటు గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లె ప్రగతిని విజయవంతం చేయడానికి పంచాయతీ పాలకవర్గం మరియు ఇతర ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు రోజు వారి షెడ్యులు అనుసరించి గ్రామాలను పారిశ్యుద్ద రహితంగా ఉంచాలన్నారు.ఎంపీడీఓ జయరాం మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించుకునేందుకు అందరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.సర్పంచ్ కె రాజిరెడ్డి మాట్లాడాతు ప్రతి రోజు ప్రజలకు కనీస అవసరాలు అయినా తాగునీరు మురుగు కాలువల నిర్వహణ వీధి దీపాలు రోడ్ల సౌకర్యల కోసం అందరి సహకారం తో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నామని “ప్రగతి” లో భాగంగా కూడా పారిశుధ్య నిర్వహణ హరితహారం వంటి వి చెప్పాడుదామనీ తెలిపారు.అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, అంగన్వాడీ సిబ్బంది, విఓలు,వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.*