నగరానికి చెందిన పారిశ్రామికవేత్త కి లండన్ పార్లమెంట్ పురస్కారం

ఖైరతాబాద్:జూన్ 03 (జనం సాక్షి) హైదరాబాద్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త,ఐఫిల్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సిఈఓ శేషాద్రి వంగల కు లండన్ పార్లమెంట్ మోస్ట్ ఎంటర్ ప్రైనర్ పురస్కారంతో సత్కరించింది. ఈ మేరకు శుక్రవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూకె , భారత్ మధ్య వ్యాపారాత్మక సంబంధాలను నెలకొల్పడంలో చేసిన కృషికిగాను తనకు ఈ గౌరవం దక్కిందని అన్నారు. జాతీయ పునర్నిర్మాణం ఆర్థిక సాధికారత స్త్రీ స్వయం శక్తి, సాంఘిక సంక్షేమం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తమ సంస్థ పని పనిచేస్తుందని అన్నారు. తమ కంపెనీ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక వెల మంది విద్యార్థులకు చదువు చెప్పించడం తో పాటు, నిరుద్యోగులకు దాదాపు పదివేల ఉద్యోగాల వరకు రూపకల్పన చేసాము అని అన్నారు. భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులు చేపట్టి నిరుద్యోగ యువతకు చేయూతగా తమ నిర్ణయాలు ఉండబోతున్నాయని అన్నారు.సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, సిద్దార్థ్ రెడ్డి,రమేష్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.