Friday, 6 November 2026

ఐ ట్వంటీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): అంతరాష్ట్ర దొంగల ముఠాను వెస్ట్‌ జోన్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్‌ చేశామని సీపీ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. ముఠా దోపిడీ వివరాలను విూడియాకు వివరించారు. ఇదొక ప్రొఫెషనల్‌ గ్యాంగ్‌. పట్టుబడిన గ్యాంగ్‌ పేరు ‘ఐ20’. ఈ ముఠా సభ్యులు ‘ఐ20’ కారులో తిరుగుతారు. బెంగళూరు, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముఠా సభ్యులు చోరీలకు పాల్పడుతున్నారని సీపీ వివరించారు.