Thursday, 5 November 2026

కులుమనాలి మంచులో చిక్కుకున్న వరంగల్‌వాసులు

వరంగల్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: విహారయాత్రకు కులూమనాలి వెలల్‌ఇన వరంగల్‌ వాసులు అక్కడ మంచులో చిక్కుకున్నారు. విపరీతంగా మంచు కురవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విహారం కోసం వెళితే మంచు కారణంగా కష్టాలపాలయ్యారు. ఉత్తరాది విహార యాత్రకు వెళ్లిన ఎన్‌పీడీసీఎల్‌ ఇంజినీర్ల కుటుంబాల సభ్యులు అక్కడ విపరీతంగా మంచుకురవడం వల్ల కులు మనాలిలో చిక్కుకుపోయారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వంద మంది మంచులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కురిసిన మంచు తొలగించడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పర్యాటకుల బస్సు ముందుకు కదలలేక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాంతో బస్సులో ఇరుక్కున్న తెలంగాణకు చెందిన పర్యాటకులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై తమవారికి వారు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో తమవారికి ఏమైందో అని ఇక్కడి వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు అక్కడి అదికారులతో మాట్లాడితే వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *