Wednesday, 4 November 2026

ఒబామా పర్యటన షెడ్యూలు ఖరారు

5

దిల్లీ,జనవరి21(జనంసాక్షి):

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటన షెడ్యూలు ఖరారైంది. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న ఒబామా జనవరి 25 వేకువజామున 4.45కు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఉదయం 10.10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.

అక్కడి నుండి బయల్దేరి 10.40కి రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. 11.20కి హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో భేట అవుతారు. 1.50కి ఇరువురు నేతలు విూడియా సమావేశంలో పాల్గొంఠారు, సాయంత్రం: రాష్ట్రపతి భవన్‌లో విందు జనవరి 26: ఉదయం 9.25: రాష్ట్రపతి భవన్‌కు రాక, 10.00: గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, 12.40-3.10: సీఈవో సదస్సులో ప్రసంగం, సాయంత్రం 5.45: ప్రధాని మోదీతో కలసి మౌర్యా షెరటాన్‌లో సీఈవోలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం, 6.50-7.20: రౌండ్‌టేబుల్‌ భేటీలో ప్రసంగం, రాత్రి: ప్రధానితో విందులో పాల్గొంఠారు ఇక జనవరి 27న ఉదయం 10.40: ఢిల్లీలోని ఎర్రకోటకు, 12.20-1.30: ¬టల్‌లో మధ్యాహ్న భోజనం, 3.05-4.05:  తాజ్‌మహల్‌ సందర్శన, సాయంత్రం 4.35: పాలం ఎయిర్‌పోర్టుకు, 5.50 గంటలు: అమెరికాకు తిరుగు పయనం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *