చివరిరోజు నామపత్రాలు సమర్పించిన కేజ్రీవాల్, కిరణ్‌బేడీ
దిల్లీ,జనవరి21(జనంసాక్షి): ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజీవ్రాల్, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ లు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ సిఎం అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో కేజ్రీవాల్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో పోలిస్తే కేజీవ్రాల్ సంపద ఈసారి రూ.2లక్షలకు తగ్గింది. ఆయన తన ఆదాయ వివరాలను నామినేషన్ పత్రాల్లో దాఖలు చేశారు. తనపై 10 కేసులున్నాయని కేజీవ్రాల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా మంగళవారం నామినేషన్ వేసేందుకు బయల్దేరిన కేజీవ్రాల్ రోడ్ షోకు అభిమానులు పోటెత్తడంతో సమయానికి నామినేషన్ వేయలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా నామినేషన్ వేశారు. అలాగే అజయ్ మాకెన్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పక్రియ బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆప్ కన్వీనర్ కేజీవ్రాల్, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేజీవ్రాల్,కిరణ్‌బేడీ ఇద్దరూ అవకాశవాదులేనని ఘాటైన విమర్శలు చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు వారి రాజకీయ కాంక్షలను నెరవేర్చుకునేందుకే అన్నాహజారే జపం చేశారని మండిపడ్డారు. కేజీవ్రాల్, బేడీలు అవినీతిపై మ¬ద్యమం చేసిన అన్నాహజారే సిద్ధాంతాలతో ముందుకు వచ్చినవారేనన్నారు. గతంలో ఎన్‌జీవోలుగా ఉన్న ఇద్దరు నేతలు తమ రాజకీయ లబ్ధికోసమే అన్నాహజారేకు మద్దతు పలికారని మండిపడ్డారు. కిరణ్‌బేడీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు మాకెన్ సమాధానమిస్తూ కిరణ్‌బేడీ ఓ మంచి పోలీస్ అధికారి అన్నారు. కానీ రాజకీయ చదరంగంలో భిన్న శక్తిసామర్థ్యాలు అవసరమవుతాయని సూచించారు.





