Tuesday, 3 November 2026

ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రుల హర్షం

వాషింగ్టస్‌: అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు ప్రవాససాంధ్రులు సైతం తోలి నుంచి డెమోక్రటిక్‌ పార్టికి గట్టి మద్దతుదారులుగానే నిలుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికయిన బరాక్‌ ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. భారతదేశంలో హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఒబామా ఎల్లప్పుడూ ప్రశంసించేవారు. దీనికితోడు చాల మంది ప్రవాస భారతీయులకు ఒబామా కీలక పదవులను కట్టబెట్టారు. ఒబామా విజయం పట్ల తానా, ఆటా, నాటా, నాబ్స్‌ వంటి ప్రవాస  తెలుగు సంఘాల నేతలు, పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ఒబామాకు అభినందన సందేశాలు పంపారు. భారత్‌, అమెరికాల మధ్య మరింత ధృడమైన సంబంధాలు ఏర్పడేవిధంగా ఒబామా విజయం తోడ్పడుతుందని వారి సందేశాలో పేర్కొన్నారు.న్యూజెర్సి రాష్ట్రంలో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రతినిధుల సభకు పోటీ చేసిన చివుకుల ఉపేంద్ర స్వల్ప ఆధిక్యంతో పరాజయం కావటం ప్రవాసాంధ్రులను కాస్త నిరాశ కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *