ఓపెన్ ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్మీడియట్ లో 2022- 23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినట్లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యయన కేంద్రం సమన్వయకర్త , ప్రిన్సిపాల్
 పెరుమాళ్ళ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.అడ్మిషన్ పొందాలనుకునే అభ్యాసకులు ఈనెల 30 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని , సంబంధిత ధ్రువపత్రాలను కళాశాలలో అందజేయాలన్నారు.పూర్తి వివరాల కొరకు 9908616815  సెల్ నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.