Saturday, 7 November 2026

ఓవైసీ ఒక రాజకీయ వ్యభిచారి..

– ఎవరు డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు

– బీజేపీ నేత కృష్ణసాగర్‌

హైదరాబాద్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కాంగ్రెస్‌ పార్టీ తనకు రూ. 25 లక్షలు ఇవ్వజూపిందని ఒవైసీ ఆరోపించారని.. అసలు టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీలతో కాపురం చేయడానికి ఎంఐఎం సిద్ధమయిందని అన్నారు. ఎవరు ఎక్కువ డబ్బిస్తే ఒవైసీ వాళ్ల దగ్గరకు వెళతారని విమర్శించారు. అసదుద్దీన్‌ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ద్రోహులను పెంచడంలో, విూడియా విూద ఆంక్షలు విధించడంలో, నేరాల పెరుగుదలలో, మద్యం అమ్మకాల్లో, అవినీతిలో, అబద్ధాలు చెప్పడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని కృష్ణసాగర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కారుకు పంక్చర్‌ కాబోతోందనే… కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి మళ్లీ వస్తామని ఒకవైపు టీఆర్‌ఎస్‌, వచ్చే సారి మేమే అధికారంలోకి వస్తామని కూటమిలు కలలు కంటున్నాయని

అన్నారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. కేంద్రంలో మోడీ పాలిస్తున్న పాలనను చూసి తెలంగాణ ప్రజలు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పట్టం కట్టేందుకు అధికమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని కృష్ణసాగర్‌ పేర్కొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు.