ఓ వ్యక్తి ‘కుటుంబ సామ్రాజ్యం’ ఇది..
38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. మనవళ్లు, మనవరాళ్లతో కలిపి మొత్తం 181 మంది కుటుంబసభ్యులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన ఓ వ్యక్తికి సంబంధించిన లెక్కలు ఇవి. మిజోరం రాష్ట్రానికి చెందిన జియోనా చానా ‘కుటుంబ సామ్రాజ్యం’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..
* చానాకు మొదటిసారిగా 15 ఏళ్ల వయస్సులో పెళ్లి అయింది. 2004లో 60 ఏళ్ల వయస్సులో ఆయన చివరి వివాహం చేసుకున్నారు.
* మొత్తం కుటుంబసభ్యులు 181 మంది. పిల్లలు, భార్యలతో 4 అంతస్తుల భవనంలో ఆయన నివాసం ఉంటున్నాడు. వంద గదులున్న ఆ భవనం పెద్ద హోటల్‌ను తలపిస్తుంది.
* మొత్తం కుటుంబానికి ఒక రోజు విందు ఏర్పాటు చేయడానికి వారికి 30 కోళ్లు అవసరమవుతాయి.
* ఆ కుటుంబంలో మిలటరీ క్రమశిక్షణ పాటిస్తారు. పెద్ద భార్య జాతియాంగి ఆ ఇంట్లో వంట, శుభ్రత తదితర బాధ్యతలు చూసుకుంటారు.
* మిజోరాంలోని బక్తవంగ్ గ్రామం వీరి భారీ కుటుంబం కారణంగా పర్యాటక ప్రదేశంగా మారింది. వీరిని చూడటానికి పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారట!
* జులై 22న ఆయన కుటుంబసభ్యులతో కలిసి 72వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నాడు.
* ‘నేను దేవుని ప్రత్యేక పుత్రుడ్ని.. అందుకే ఇంత మంది బాధ్యతలు చూసుకోమని నాకు దేవుడు వీరిని ప్రసాదించాడు’ అని చానా తన జన్మదినం సందర్భంగా గర్వంగా చెప్పుకొన్నాడు.