కందగిరి లక్ష్మినరసింహ స్వామి కి ప్రత్యేక పూజాలు నిర్వహించిన డోర్నకల్  నియేజకవర్గ బాద్యులు మాలోత్ నెహ్రు నాయక్ 

-ఎమ్మెల్యేకి గెలిస్తే కందగిరి గుట్ట వరకు రోడ్డు వేయిస్తా


కురివి నవంబర్-9 (జనం సాక్షి న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కందికొండ గ్రామ కార్తీకమాస సందర్భంగా నిర్వహించు కందగిరి లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో మాలోత్ నెహ్రు నాయక్ హాజరు అయ్యారు.ఈ సంద్భరంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులు సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.అదే విధంగా ప్రభుత్వం ఉన్నది ప్రజల సమస్యలు తీర్చడానికి అన్నారు.వందల సంవత్సరాల  చరిత్ర  గల దేవలయనికి ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ  అధికారంలో రాగేనా మొదటిగా మెయిన్ రోడ్ నుంచి ఆలయం వరకు తారు రోడ్డు నిర్మాణం చేపడుతాం అని అన్నారు. నెహ్రు నాయక్  వెంట కురవి మండలా బాద్యులు వద్దుల మహేందర్ రెడ్డి జిల్లా నాయకులు రాఘురామ్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి శ్యామాల శ్రీనివాస్,బిసి నాయకులు ఎడ్ల వెంకన్న,బదె వీరభద్రం,సోషల్ మీడియా ఇంచార్జ్ గుగులోత్ నవీన్,గుగులోత్ లాలు నాయకులు మూతిలింగామ్ వెంక్కన్నా ,సోషల్ కమీటి సభ్యులు మెహన్,బానోతు దేవ సింగ్, భానోత్ శ్రీను, కురవి మండల నాయకులు డిఎస్ జగదీష్, డోర్నకల్ సోషల్ మీడియా మోహన్, సాయి,వినయ్,బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.