Thursday, 5 November 2026

కడప ఉక్కు ఫ్యాక్టరీపై మాటతప్పిన బిజెపి: మంత్రి

విజయవాడ,జూన్‌20(జ‌నం సాక్షి ): బీజేపీపై మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు. బుధవారం విూడియాతో మాట్లాడిన ఆయన..కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై మెకాన్‌ సంస్థ సీఎంవోతోనూ చర్చలు జరిపిందన్నారు. మెకాన్‌ సంస్థ సందేహాలను ప్రభుత్వం తీర్చిందన్నారు. 2014 తర్వాత 40శాతం ఉక్కు ధరలు పెరిగితే.. కడపలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. రాయలసీమ డిక్లరేషన్‌ హక్కు బీజేపీకి లేదన్నారు. ఇవన్నీ చెప్పిన బజిఎపి ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీకి మోకాలడ్డుతోందన్నారు. ప్రజలు బజిఎపి డ్రామాలు గమనిస్తున్నారని అన్నారు. ఇచ్చిన విబజన హావిూలు అమలు చేయకుండా నాలుగేళ్ల పాటు నాన్చారని అన్నారు. బిజెపిక ప్రజలు తగినరీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.