లారీని ఢీకొన్నకారు: నలుగురు మృతి
కడప,అక్టోబర్4 (జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరు గాయపడ్డారు. హర్షవర్థన్, బుజ్జి, భూదేవి సంఘటనా స్థలంలోనే చనిపోయారు.క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కడపకు చెందిన వీరంతా బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




