అనంతపురం,మార్చి3(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలను మంగళవారం ఉదయం ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. విధులకు హాజరుకాని ఈఎన్‌టీ నిపుణుడికి మెమో ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.




