Tuesday, 3 November 2026

కన్నడలో ‘బాహుబలి 2’ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్

తనపై ఉన్న కోపాన్నిబాహుబలి 2 సినిమాపై తీర్చుకోవద్దని తమిళ నటుడు సత్యరాజ్ చేసిన క్షమాపణల ప్రకటనతో కన్నడ ప్రజా సంఘాలు దిగివచ్చాయి. సత్యరాజ్ కన్నడిగులకి క్షమాపణలు చెప్పడంతో ఆ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయింది. 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకిగాను కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంటూ శుక్రవారం సత్యరాజ్ చేసిన ప్రకటనపై శనివారం స్పందించాయి కన్నడ ప్రజా సంఘాలు. బాహుబలి 2 విడుదలకి ఓకే చెబుతున్నట్టు స్పష్టంచేశాయి. దీంతో ఏప్రిల్ 28న కర్ణాటకలో కూడా బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే.. భవిష్యత్‌లో మాత్రం మళ్లీ కన్నడిగులపై ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పాయి కన్నడ ప్రజా సంఘాలు. కన్నడిగుల నుంచి వెలువడి ఈ ప్రకటన బాహుబలి 2 నిర్మాతలకి పెద్ద రిలీఫ్‌ని ఇచ్చే శుభ పరిణామమే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *