విజయనగరం,నవంబర్2(జనంసాక్షి): జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిచాలని కోరుతూ ఈనెల 5 కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలోని 34 మండలాలు పంటలు పోవడం జరిగిందన్నారు. జిల్లాలో రైతులు పంటలు పండక పోవడం వలన రైతులు పంటను దగ్ధం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం 17 మండలలకే కరువు ఉన్నట్లు అధికారులు ప్రతిపాదనలు పంపించడం సరికాదన్నారు.జిల్లాలో అన్ని మండలాల్లో కరువు ఉందని,జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి,ఎకరాకు 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ 5 తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పొలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.




