మహాసభల్లో నేతల ఉద్ఘాటన
విజయనగరం,నవంబర్2(జనంసాక్షి): విజయనగరం జిల్లా సిపిఐ ,అమర్ భవనం నందు ఎఐటియుసి విజయనగరం జిల్లా 10వ మహాసభలు నిర్వహించారు. మొదటగా ఎఐటియుసి జెండా ఆవిష్కరించారు. ఆనంతరం రాష్ట్ర ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఈ ఆక్టోబర్ 31వ తేదీ నాటికి ఎఐటియుసి ఆవిర్బవించి 99సం.వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కార్మిక వర్గం ఆశించిన అంతిమ లక్ష్యం సాదించే వరకు ఎర్రజెండా పోరాటాలు చేస్తుందన్నారు. కార్మిక వర్గం ప్రాంతీయ తత్త్వానికి అతీతంగా పనిచేస్తుంది అని తెలిపారు. కార్మికుల సమస్యలు ను పరిష్కరం చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అని విమర్శించారు. సంఘాలు ద్వారా నే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర ఉపాద్యక్షులు వి.కృష్ణంరాజు, పడాల రమణ ,రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణ రావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలరాజు,సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ పాల్గొన్నారు.




