Tuesday, 3 November 2026

కరువు మండలాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

C

– 200 మండలాలు గుర్తింపు

హైదరాబాద్‌ నవంబర్‌18(జనంసాక్షి):

రాష్ట్రంలో కరవు మండలాలపై సీఎం కేసీఆర్‌ నేడు సవిూక్ష చేపట్టారు. ఈ సవిూక్ష సమావేశాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు సంబంధిత శాఖాధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం కరవు మండలాల సంఖ్యను ఖరారు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. 200కు పైగా కరవు మండలాలున్నట్లు ప్రాథమిక నివేదికల ప్రకారం గుర్తింపు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 3,4 రోజుల్లో కరవు మండలాలు గుర్తించాలని ఆదేశం. అనంతరం కేంద్ర సహాయం కోసం నివేదించాలని సీఎం సూచించారు.

తెలంగాణపై కేంద్ర బీజేపీ సర్కారు వివక్ష

తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష మరోసారి బట్టబయలైంది. పట్టణ పేదలకు గృహాల కేటాయింపులో రాష్ట్రానికి ఘోర అన్యాయం చేసింది. తెలంగాణలోని 10 పట్టణాలకు 10,290 ఇండ్లను మాత్రమే కేటాయించింది. అదే ఆంధ్రప్రదేశ్‌ లోని 37 పట్టణాలకు 1,93,147 ఇండ్లు మంజూరు చేసింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దగ్గర ఉన్న పట్టణ గృహ నిర్మాణ శాఖ ఈ కేటాయింపులు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒకే గది ఇల్లు కట్టిస్తోందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తోందని ఇటీవల వరంగల్‌ వచ్చినప్పుడు మెచ్చుకున్న వెంకయ్య నాయుడు.. కేటాయింపులకు వచ్చేసరికి మొండిచేయి చూపారు.

పేదలకు రెండు తరాల వరకు ఇంటి సమస్య ఉండకూడదని, వారు ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఇంటికి ఐదున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఈ సంవత్సరం 60 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు, సంకల్పానికి ప్రోత్సాహం అందించాల్సింది పోయి.. కేంద్ర ప్రభుత్వం మరోసారి సవతి తల్లి ప్రేమ చూపించింది. కేంద్ర ప్రభుత్వ వివక్షపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని టిఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ చెప్పారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా 50 వేల రూపాయలు ఇవ్వనుంది. 2022 కల్లా దేశంలో రెండు కోట్ల ఇండ్లు నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఇండ్లను మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *