Tuesday, 3 November 2026

కరువొచ్చింది.. కేంద్రం ఆదుకోవాలి

C

– కేంద్ర కరువు బృందంతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌,డిసెంబర్‌8(జనంసాక్షి): కరువు భారిన పడ్డ తెలంగాణకు సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర కరువు బృందాన్ని కోరారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితుల అధ్యయనానికి వచ్చిన కేంద్ర కరువు బృందం నేడు సీఎం కేసీఆర్‌ భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర బృందానికి వివరించారు. సీఎం పలు విషయాలను వెల్లడిస్తూ..తెలంగాణలోని కరువు మండలాలకు తగిన సాయం అందించాలి. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాత్కిలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. రైతులకు తక్షణం ఆదుకునేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పశువుల దాన పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. పశుగ్రాసానికి నిధులు మంజూరు చేయాలి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, అడవుల అభివృద్ధి లాంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. కరువు పరిస్థితులను అధిగమించేందుకు 231 మండలాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలి. గ్రావిూణ ఉపాధిహామి పథకం పని దినాలు 200 రోజులకు పెంచాలి. వ్యవసాయాన్ని జాతీయ ఉపాధిహావిూ పథకంతో అనుసంధానం చేయాలి. కరువు ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడానికి సమైక్యపాలకులే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 1964లో ప్రారంభించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదు. 1600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. రాష్ట్రంలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి. తెలంగాణలో 21 లక్షల మంది రైతులు బోర్లవిూద వ్యవసాయం చేస్తున్నరు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టింది. మంచినీటికి ఇబ్బంది ఉండొద్దని మిషన్‌ భగీరథను చేపట్టినం. వ్యవసాయ భూములను క్రాప్‌ కాలనీలుగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇదిలా వుండగా రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దుర్బరంగా ఉందని కేంద్ర కరువు బృందం కన్వీనర్‌ మహరాజ్‌కుమార్‌ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణకు అడిగింది చాలా తక్కువని తాము తమ పర్యటనల్లో గుర్తించామని కేంద్ర కరువు బృందం కన్వీనర్‌ మహారాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కేంద్ర కరువు బృందం సభ్యులైన ఓందత్‌ శర్మ, ఓం కిషోర్‌ లతో కలిసి ఆయన మెదక్‌ జిల్లాలో పర్యటించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం రైతు సంఘాలనుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొరిక మేరకు అద్యయనం కోసం కేంద్రం  బృందంలను పంపడం జరిగిందన్నారు. జిల్లాలోని సర్దార్‌నగర్‌ తాండ, బోర్గి, కంగ్టి, గూడూరు, మంజీరాను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కరువు పరిస్థితులను నివారించేందుకు గాను 2431 కోట్ల రూపాయలను మాత్రమే అడిగారని, ఇది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఒక్క మెదక్‌ జిల్లాలోనే 1600కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని, నిజామాబాద్‌ జిల్లానుంచి 1400 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయన్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు  తెలంగాణా రాష్ట్రం మొత్తం పర్యటించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. గత రెండు సంవత్సరాలనుంచి వర్షాలు లేవని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా గ్రామాలలో తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో జూన్‌ మాసంలో వర్షాలు కురుస్తాయని, అప్పటివరకు ఉన్న నీటినివృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కరువు బృందానికి నివేదించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలను కరువు బృందానికి చూపించి వివరించినట్లు తెలిపారు. సంగారెడ్డికి మంచినీరు అందించే మంజీరా ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిందని బృందానికి ప్రత్యక్షంగా చూపించి వివరించారు. పటాన్‌చెరు, రాంచంద్రాపురం ప్రాంతాలు పూర్తిగా కాలుష్యమయమయ్యాయని ఆ ప్రాంతాలకు రవాణా ద్వారా తాగునీటిని అందించేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందానికి వివరించారు.  కేంద్ర కరువు బృందం వెంట రాష్ట్రస్పోర్ట్స్‌ అధారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినకర్‌బాబు వివిద శాఖల అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *