మల్లు భట్టి విక్రమార్క సవాల్
హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్కమార్క సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ…కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని కేసీఆర్ పచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి పై కేసీఆర్‌తో తాను చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ ల వల్లనే ఇవాళ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీరాయని స్పష్టం చేసిన భట్టి… రూ. 1500 కోట్లతో ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పక్కన పడేసి… రూ. 13 వేల కోట్ల దోపిడీ కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ తెచ్చిందని ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లు పూర్తికాకుండా అడ్డుకున్నదే కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు.




