హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): కొత్త ఓటరుగా నమోదైన వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్ Aబూత్ వద్ద అధికారులు ఉచితంగానే ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. పాత ఓటర్లు మాత్రమే రూ.25లు చెల్లించి విూసేవా కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులను పొందాలని సూచించారు. కొన్ని విూసేవా కేంద్రాల్లో ఓటరు కార్డుకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, రూ.25లకు మించి అదనంగా ఎవరైనా వసూలు చేస్తే వివరాలతో 1950 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణతో నకిలీ ఓట్లకు చెక్ పెట్టామని ఆయన చెప్పారు.




