ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు
రానున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు త్వరలోనే వరించనున్నాయి. దసరా పండగ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపోమాపో ఉత్తర్వులు విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త.. విద్యుత్ సంస్థలు ఉద్యోగులకు దసరా కానుకగా భారీగా పదోన్నతులు ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కి వచ్చింది. దాదాపు వెయ్యి నుంచి 1200 వరకూ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి. ఏఈ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి వరకూ ఈ పదోన్నతులు ఉంటాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న విద్యుత్ సంస్థల ఉద్యోగుల్లో ఈ తాజా కసరత్తు పట్ల హర్షం వ్యక్తమవుతున్నది.
ఒకేసారి జెన్కో, ట్రాన్స్ కో, సదరన్ డిస్కం, నార్తర్న్ డిస్కం పరిధిలోని ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. ఆయా ఉద్యోగుల సీనియారిటీ, అర్హతల ఆధారంగా నిర్వహిస్తున్న కసరత్తు దాదాపు ముగింపునకు వచ్చింది. భారీసంఖ్యలో వివిధ కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియపై జెన్కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ముమ్మర కసరత్తు జరిపాయి. సంబంధిత అధికారులు నాలుగు రోజులుగా పదోన్నతుల జాబితాను రూపొందిస్తున్నారు. ట్రాన్స్ కో, జెన్కోతోపాటు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బందికి అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్, డివిజినల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్తోపాటు ఆయా విభాగాల్లోని సీఈ, సీజీఎం పదోన్నతులు, పరిపాలనా విభాగంలో పీఓ, జేఎస్, డీఎస్, ఏఎస్ పదోన్నతులు ఇవ్వనున్నారు.
అకౌంట్స్ విభాగంలోని పీఏఎన్సీసీఏ, డిప్యూటీ ఎస్ఏవో, ఏఏవోఏవో లకు పదోన్నతులు కల్పించనున్నారు. రెండు డిస్కమ్లతోపాటు ట్రాన్స్ కో, జెన్కోల పరిధిలోని ఒక్కో విభాగంలో 150 నుంచి 250 వరకు పదోన్నతులు దక్కనున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించిన అధికారులు.. అర్హులను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దసరా పండుగలోపు ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోం ది.
కరెంట్ ఉద్యోగులకు మరింత మంచి రోజులు




