Thursday, 5 November 2026

నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షల

సద్దుల బతుకమ్మకు మహానగరం ముస్తాబైంది. బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బతుకమ్మ వేడుకులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. సికింద్రాబాద్, కట్టమైసమ్మ గుడి, కవాడిగూడ, ఇక్బాల్‌మినార్, ఏఆర్‌పెట్రోల్ పంప్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీస్ కంట్రోల్ రూం, నాంపల్లి, హిమాయత్‌నగర్ వైజంక్షన్, పంజాగుట్ట, రాజ్‌భవన్, బుద్ధ భవన్ వైపు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *