Wednesday, 4 November 2026

కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

బెంగళూరు , జనంసాక్షి: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. మే 5న కర్ణాటక విధానసభకు పోలింగ్‌ జరగనుంది. మే 8న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 223 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మకమైన ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నెల రోజుల పాటూ ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *