Tuesday, 3 November 2026

కర్నూలు జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా

20 మందికి గాయాలు…8 మంది పరిస్థితి విషమం

కర్నూలు, ఫిబ్రవరి 5 : జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు క్రాస్ట్‌ రోడ్డు వద్ద గురువారం ఉదయం పెళ్లి బృందం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను రెండు 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పెందుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పెళ్లిబృందం ట్రాక్టర్‌ ఉప్పలపాడు వద్ద అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *