హైదరాబాద్: సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని సభ్యుల బృందం ఇవాళ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి సిలబస్ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకుని సిలబస్, పరీక్ష విధానంలో స్వల్ప మార్పులే చేశామని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్‌లను జారీ చేయాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సిలబస్ కమిటీ, పరీక్షలకు సంబంధించి ఎటువంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.




