కలకలం సృష్టించిన నవవధువు అదృశ్యం
కడప,మే28(జనం సాక్షి): వివాహమైన రోజే నవ వధువు అదృశ్యమైన సంఘటన కడప జిల్లా రాజంపేట మండలంలోని అత్తిరాల సవిూపంలోని వినాయక్‌నగర్‌లో చోటుచేసుకుంది. మన్నూరు ఎస్సై మహేష్ కథనం మేరకు.. స్థానికంగా నివసించే ఆరుపోయిన రమణమ్మ కుమార్తె సునీతకు ఈనెల 25న కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్యతో కోడూరులో వివాహం జరిగింది. పెళ్లయిన అనంతరం ఆదేరోజు సాయంత్రం నవ దంపతులు అత్తిరాలకు చేరుకొన్నారు. రాత్రి సమయంలో ఇంటి బయట అటుఇటూ తిరుగుతూ ఉన్న సునీత ఉన్నపళంగా కనిపించలేదు. కంగారు పడిన కుటుంబీకులు చుట్టుపక్కల బంధువులు, సన్నిహితుల ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం మన్నూరు పోలీసులను ఆశ్రయించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.