-గుంటూరు ఎంపీ రాయపాటి
గుంటూరు : విధి నిర్వహణంలో అలసత్వం వహించిన మంత్రులను కేంద్రం తొలగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాయపాటి అన్నారు. ఈ విషయంలో ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన గుంటూరులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.




