Tuesday, 3 November 2026

కళాతపస్వి అస్తమయం 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కళాతపస్వి అస్తమయంకళాతపస్వి అస్తమయం  కళాతపస్వి అస్తమయం
శంకరాభరణం రిలీజ్‌ తేదీనే చివరి శ్వాసతెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన విశ్వనాథ్‌వెండితెరపై దృశ్యకావ్యాలు సృష్టించిన దర్శక దిగ్గజంకథా కథనాలే హీరోహీరోయిన్లు..నటుడిగానూ పలు పాత్రలుఫాల్కే, రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ పురస్కారాలుశోక సంద్రంలో భారతీయ చిత్రపరిశ్రమముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ప్రముఖుల సంతాపంకాశీనాథుని విశ్వనాథ్‌ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్‌ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన సినిమాల్లో కథాకథనాలే హీరో హీరోయిన్లు. ఆయన తిప్పిన మలుపుతో తెలుగు సినిమా గుండెల్లో నాదం ఝుమ్మంటే, పాదం సై అంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం.. ఇలా ఒక్కో సినిమా తెలుగు సినిమా కీర్తిని దశదిశలా చాటింది. ప్రాంతీయంగా మొదలైన ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ ఎల్లలు దాటింది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. తెలుగు సినిమాను ఆస్కార్‌ అంచుల దాకా తీసుకువెళ్లిన ఘనకీర్తి ఆయన సొంతం. మెండైన సినిమాలు తీశారు. నిండైన జీవితాన్ని చూశారు. కళాఖండాలకు చిరునామాగా మారిన కే విశ్వనాథ్‌ కానరాని లోకాలకు తరలిపోయారు. వెండితెర వెలవెల పోయింది. ప్రేక్షకలోకం ‘దొరకునా.. ఇటువంటి దర్శకుడ’ని శోకసంద్రంలో మునిగింది. తెలుగు సినిమాకి సాంస్కృతిక తేజాన్ని, ఉత్తేజాన్ని నింపిన కళాతపస్వి కే విశ్వనాథ్‌(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలోహాస్పిటల్‌లో చికిత్సపొందుతూ గురువారం రాత్రి చివరిశ్వాస వదిలారు. ఆయనకు జాతీయస్థాయిలో ఎంతో పేరు తెచ్చిన శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. అదేరోజైన గురువారం యాదృచ్ఛికంగా కన్నుమూశారు. విశ్వనాథ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సినీనటుడు చిరంజీవి, పలువురు సంతాపం తెలిపారు. విశ్వనాథ్‌కు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగులో 41, హిందీలో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు.