మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 02,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లింగం గురువారం రోజున జగిత్యాల జిల్లా నూతన కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన పదవి స్వీకరించిన యాస్మిన్ భాషా కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెట్పల్లి కమిషనర్ గా నియమించాలని మున్సిపల్ కమిషనర్ లేక పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని ఇంచార్జి పరిపాలన నడుస్తుందని కలెక్టర్ కు విన్నవించామని ఈ సందర్భంగా తెలిపారు. రెండు రోజుల తర్వాత సమస్యకు పరిష్కారం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు




