కష్టాల కొలిమిలో కౌలు రైతులు

పంట వేసింది మొదలు అమ్ముకునే వరకు నష్టాలే
భూ హక్కులు లేకపోవడంతో తిప్పలు

హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి): కౌలురైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు,
వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారికి వ్యవసాయం చేసే ఆసక్తి లేకపోవడంతో పాటు సాగు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు లేక తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుంటారు. ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడతలుగా అందిస్తున్న రైతు బంధు సాయం పట్టాదారైన రైతుల ఖాతాల్లోనే జమ అవుతోంది. పంటను సాగు చేసిన కౌలు రైతు పేరు ఎక్కడా లేకుండా పోయింది. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు సైతం కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. గతంలో కౌలు రైతులకు రుణ అర్హత కల్గిన కార్డులను జారీ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా భూములన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. కొత్తగా జారీ చేసిన డిజిటల్‌ పాస్‌ పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహా ఇతర కాలం ఎక్కడా లేదు. దీంతో కౌలు రైతులకు శాశ్వతంగా అడ్డుకట్టపడిరది. పెరుగుతున్న పెట్టుబడులురోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందక, పండిరచిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భూ యజమానులకు మాత్రంముందుగానే చేతికి అందుతోంది. కష్టపడి పనిచేసే రైతులకు ఎక్కడా సహాయం అందడం లేదు. వ్యవసాయమే తప్ప ఇతర పని చేయలేని కౌలు రైతులు ఏడాదంతా కష్టపడి పండిరచిన పంట తీసుకున్న అప్పులు, వాటి వడ్డీకే సరిపోతోంది. కౌలు డబ్బులు కాకుండా రైతు కుటుంబ సభ్యుల కష్టం పోనూ ఎరువులు, విత్తనాలకు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ వానాకాలం సీజన్‌లో అయినా కౌలు రైతులను గుర్తించి అర్హత కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందించేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు. అమ్ముకోవడానికి సైతం తిప్పలుకౌలు రైతులకు పంట అమ్ముకోవడానికీ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారు. అనే వివరాలను వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం పట్టా పాసు పుస్తకం ఉన్న రైతుల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌ చేస్తున్నారు. తమకు రైతుబంధు సాయం ఎక్కడ రాదో అన్న భయంతో పంట సాగు చేయకుండా పట్టా పాసు పుస్తకం ఉన్న భూ యజమానులు సైతం కౌలు రైతు పంటను తమపేరున నమోదు చేసుకుంటున్నారు. వివరాలు అన్ని భూ యజమాని పేరిట ఉండడంతో కౌలు రైతు
పండిరచిన పంట విక్రయించే సమయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కౌలు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలు, సీసీఐ కేంద్రాల వద్ద విక్రయించేటప్పుడు భూయజమాని వివరాలు ముందస్తుగా ఉండడంతో వారి ఖాతాల్లో పంట విక్రయానికి సంబంధించి సొమ్ము జమ అవుతోంది. తిరిగి వారి ఖాతాల్లో నుంచి తీసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగినా పరిహారం సైతం కౌలుకు ఇచ్చిన భూ యజమానికే వర్తిస్తుందని కౌలు రైతులు చెబుతున్నారు.