– కన్నతల్లినే కొట్టి చంపిన కుమారుడు
– తల్లి నడిపిన చిట్టీల వ్యాపారంలో నష్టమొచ్చిందని హతమార్చిన కొడుకు
హైదరాబాద్, జూన్28(జనం సాక్షి) : నవమాసాలు మోసి కన్నతల్లిని ఓ కర్కశ కొడుకే హతమార్చిన ఘటన గురువారం నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది. చిట్టీల వ్యాపారం చేసి నష్టాలు తీసుకొచ్చిందనే కోపంలో ఓ కర్కశ కొడుకు కన్నతల్లినే పాశవికంగా హత్య చేశాడు. చిట్టీల వ్యాపారంలో అప్పులు పాలు కావడంతో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి నిలదీస్తున్నారని కొడుకు అవమానంగా భావించాడు. దీంతో తల్లి మమతను కొడుకు మదన్(22) బుధవారం రాత్రి భవనం పైకి తీసుకెళ్లి కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి భార్యపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిట్టీల వ్యాపారంలో నష్టమొచ్చిందనా..? మరో కారణంతా హతమార్చారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కసాయి కొడుకు




