కాంగ్రెస్‌కు కలసి వస్తున్నహోదా హావిూ
ఎపిలో ప్రస్తుత పరిసథితులు కాంగ్రెస్‌కు కలసి వచ్చేలా ఉన్నాయి. ప్రత్యేక¬దా అంశం పార్లమెంటులో చర్చకు వచ్చినా కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వక పోవడంతో కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రం లభించినట్లు అయ్యింది. తామే ¬దా ఇస్తామని ఇక విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం బిజెపి ఇచ్చింది. ఎపిలో పాగా వేస్తామని చెప్పుకుంటున్న బిజెపికి ప్రస్తుత వ్యతిరేకత అర్థం కావడం లేదు. ఎపిని బిజెపి మోసం చేసిందన్న భావనలో ఉన్న ప్రజలకు ఊరటనిచ్చేలా చేయలేకపోయింది. ఇప్పుడదే కాంగ్రెస్ పార్టీకి కలసివచ్చే అంవంగా మారింది. నాలుగేళ్ల బిజెపి,టిడిపి కాపురంలో ఎపికి నష్టం జరిగిందన్న ప్రచారం కూడా చేస్తోంది. ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన ఉమెన్ చాందీ ఇప్పుడు ఇదే అంశాన్ని బాగా ప్రచారంలోకి తీసుకుని వెళుతున్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను, విభజన సందర్బంగా రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక ¬దా సహా పలు హావిూలను తాము అధికారంలోకొచ్చాక తప్పక అమలు చేస్తామన్న బిజెపి గద్దెనెక్కాక గడచిన నాలుగేళ్లలో పక్కన పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీలో ఏమొచ్చిందో ఏమి రాలేదో ప్రజలకు తెలియదు. అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన మోడీ సర్కారుపై ఎపిలో వ్యతిరేక ఉంది. అలాగే దానితో అంటకాగిన టిడిపికి కూడా బాధ్యత ఉందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. ఇదే అదనుగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పాతకాపులను రప్పించడం, ప్తర్యేక¬దా మేమే ఇస్తామని చెప్పడం కలసి వస్తోంది. రాహుల్ ప్రధాని అయితే హావిూలు నెరవేరుస్తామని చెబుతోంది. బిజెపి ప్రభుత్వం ఎపికి తలపెట్టిన విద్రోహం పార్లమెంట్ సాక్షిగా యావత్ దేశానికి బహిర్గతమైందని కాం/-గరెస్ మరోమారు ప్రచారం చేసుకునే అవకాశం వచ్చింది. మొన్నటి సమావేశాల్లో టిడిపి, మరికొన్ని పార్టీల మద్దతు తీసుకొని అవిశ్వాసం ప్రవేశపెట్టగా చర్చకు అనుమతించిన కేంద్రం ఎపికి ఇచ్చిన హావిూలపై స్పష్టతల ఇవ్వలేదు. ప్రధాని మోడీ, ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభ వేదికపై అనేక విషయాలు చెప్పినా ఎపికి సంబంధించిన హావిూలపై మాటమాత్రంగా అయినా హావిూ ఇవ్వలేదు. కేవలం అండగా ఉంటామని అని సరిపెట్టారు. అందుకే ఎపి ప్రజలను బిజెపి నేతలు నిలువునా వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ పల్లవి అందుకుంది. ఎపికి ప్రత్యేక ¬దా ఇవ్వకపోవడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులే కారణమని మరోసారి మోడీ చెప్పడం కూడా అబద్దం కాక మరోటి కాదు. ఆర్థిక సంఘం ఛైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అభిజిత్‌సేన్, గోవిందరావు తాము ఆ సిఫారసు చేయలేదని ఇచ్చిన వివరణలను సభలో సభ్యులు ప్రదర్శించినా తోసిపుచ్చారు. దాదాపు సభలోని ప్రతిపక్షాలన్నీ ఎపికి న్యాయం చేయాలని కోరినా పెడచెవిన పెట్టారు. అసలు ఆర్థిక సంఘానికి ప్రత్యేక ¬దా ఇచ్చే అంశంపై సిఫారసు చేసే అధికారం లేదన్నది స్పష్టం. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో వాటాలను, రెవెన్యూలోటు భర్తీ తదితర ప్రణాళికేతర నిధులను రాష్ట్రాలకు పంచుతుంది. ¬దాకు సమానంగా ప్యాకేజి అనేది అతి పెద్ద దగా అన్నది కూడా తేలిపోయింది. అసలు ¬దా వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను ఏ కొలబద్దలతో లెక్క కట్టారో చెప్పడం లేదు. కేవలం కేంద్ర పథకాల నిధులనే వల్లె వేస్తున్నారు తప్ప పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాల వలన జరిగే ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, దాని నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటి గురించి మాట్లాడట్లేదు.
లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం భారీ తేడాతో వీగిపోయినప్పటికీ ప్రజాక్షేత్రంలో మాత్రం బిజెపి అత్యంత దారుణంగా విశ్వాసాన్ని కోల్పోయింది. బడ్జెట్ సమావేశాలప్పుడే టిడిపి, వైసిపిలు ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి మోడీ సర్కారుపై అవిశ్వాసం కోసం చాలా రోజులు ప్రయత్నించాయి. సభ
ఆర్డర్లో లేదన్న సాకుతో కేంద్రం అవిశ్వాసం నుంచి తప్పించుకుపోయింది. ఆనాడు అధికారంలో ఉన్న
కాంగ్రెస్ ¬దాను చట్టంలో ఎందుకు పెట్టలేదన్న బిజెపి ఆరోపణ చేయడం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేసింది. రైల్వే జోన్, కడప ఉక్కు, పోలవరం, రాజధాని, మెట్రోరైల్, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయలు, పోర్టులు, కేంద్ర సంస్థలు, రెవెన్యూలోటు భర్తీ వీటి సంగతిని కూడా విస్మరించింది. నిజానికి మొన్నటి వరకు ఎపిలో కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. లోక్‌సభలో అవిశ్వాసం చర్చ సందర్బంగా బిజెపి పాలకుల తీరు తరవాత దానిపై కొంత పాజిటివ్ దృక్పథం ఏర్పడిందనే భావించాలి. రాహుల్‌ను ప్రధానిని చేయండి మేమే ¬దా తసీఉకుని వస్తామన్న భరోసా ఇప్పుడు ప్రజల్లో ఆశలు కలిగించేలా ఉంది. ఇది అధికార టిడిపికి, ఆశలు పెట్టుకున్న బిజెపి,వైకాపాలకు పెద్ద దెబ్బే కాగలదు. ఎందుకంటే ఎలాగూ బిజెపి ఇవ్వదని తేలిపోయింది. వైకాపాతో ఇక లాభం లేదని కూడా తెలుసు.
ఇక విభజన హావిూల విషయంలో తెలంగాణ ప్రజలు కూడా బిజెపిపై ఆగ్రహంగా ఉన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు జాతీయ ¬దా అడిగినా పట్టించుకోవడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ పెరిగిన దాఖలాలు లేవు. ఎపిలో అయితే జీరో నుంచి మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఏర్పడింది. సిఎం కెసిఆర్ తెలంగాణలో అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. కాగా నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసిన టిడిపి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న కోపం ,కసి కూడా ప్రజల్లో ఉంది. అవిశ్వాసాలు, రాజీనామాలతో కేంద్రం దిగి రాదని స్పష్టమై పోయింది. ¬దా సహా విభజన హావిూలు, విభజన చట్టంలోని అంశాల సాధనకు ప్రజలంతా తమతో కలసి రావాలన్న కాంగ్రెస వాదనలో బలముంది. ప్రజలు ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారో చెప్పలేం.