ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్న లక్ష్మీపార్వతి
హైదరాబాద్,నవంబర్3(జనంసాక్షి): కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనైతికం అన్నారు. దీంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర చంద్రబాబు పెట్టిండని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఢిల్లీకి వ్యతిరేకంగా పార్టీ పెడితే అదే ఢిల్లీలో చంద్రబాబు పార్టీని తాకట్టు పెట్టిండన్నారు. అన్ని పార్టీలతో పొత్తులు అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే అభ్యంతరం లేదు కానీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవద్దు అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.




