కాంగ్రెస్ బలం పెరుగుతోందన్న ఉత్తమ్
వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా
హైదరాబాద్,మే25(జనంసాక్షి):గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృద్వీరాజ్ సహా సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీరంతా ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…ఇలాంటి బలమైన నాయకుల చేరికతో పార్టీ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019లో గెలిచే దిశగా కాంగ్రెస్ పయనం చేస్తోందన్నారు. ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్‌ఎస్ పార్టీ జైలులో పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా ఉన్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఏ విధంగా పరాభవం ఎదురైందో.. ఇక దేశ వ్యాప్తంగా అలాంటి పరిస్థితి తప్పదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని, కేసీఆర్ పాలనలో మోసపోయామనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్‌కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 80 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బ్జడెట్ నుంచి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు బోనస్ ఇచ్చేందుకు ఉండవా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని, ప్రతి పంటకు రూ.300 నుంచి బోనస్ ఇస్తామన్నారు. బ్జడెట్‌లో పంటలకు బోనస్ ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హావిూ ఇచ్చారు. పంటలకు ప్రత్యేక బీమాను ప్రభుత్వమే చేయించి నష్టపోయిన సమయంలో పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.6.75 లక్షల కోట్ల బ్జడెట్, రూ.2 లక్షల కోట్లను అప్పులు తెచ్చినా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తన కుటుంబంలో మాత్రం
ఐదుగురికి ఉద్యోగాలు కల్పించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. టీఆర్‌ఎస్ నేతలు మిషన్ కాకతీయ, భగీరథ పేరుతో జనం విూదపడి దోపిడీ చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొన్ని పత్రికలు, విూడియా ముందుకు రావడం లేదు కాబట్టి.. సోషల్ విూడియా ద్వారా వాటిని బయటకు తీయాలని కార్యకర్తలకు సూచించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం లేదని తెలిపారు. ఏడాది నుంచి సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి పాలన ఏం చేస్తాడని ప్రశ్నించారు. హావిూల అమలులో పూర్తిగా విఫలమైన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.




