అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నా
టీఆర్ఎస్ పార్టీ నాకు ఏ హావిూ ఇవ్వలేదు
ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తా
టీకాంగ్రెస్‌లో ఒకే కులానికి ప్రాధాన్యతనిస్తున్నారు
గాంధీభవన్‌లో సమావేశాల్లో, బస్సుయాత్రల్లో ఉండేది వాళ్లే
ఉత్తమ్‌కే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
బీసీలకు న్యాయం చేయాలని రాహుల్సైతం తెలిపా
వైఎస్ తరువాత బడుగు వర్గాలకు న్యాయం చేస్తుంది కేసీఆరే
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దానం నాగేందర్
హైదరాబాద్,జూన్23(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని, కేవలం ఒకే కులానికి చెందిన నేతలు కాంగ్రెస్‌లో పదవులు అనుభవిస్తున్నారని అందుకే బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తున్న తెరాస పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పిన ఆయన.. గత మూడు దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన తాను పార్టీ వీడటం వెనుకున్న కారణాలను వివరించారు. డీఎస్, కేశవ రావు లాంటి బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లడానికి ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడమే కారణమని దానం ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడినైన తనకు తెలియకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల మంది జనాభాలో 1.67 కోట్ల మంది బీసీలే ఉన్నారని, నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలను పార్టీ పట్టించుకోవడం లేదని దానం తెలిపారు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీకి చెప్పానని దానం చెప్పారు. వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు ఉండలేక ఉంటున్నారని దానం తెలిపారు. జెండా మోసిన కార్యకర్తలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గాంధీ భవన్ విూటింగ్ల్లో, బస్సు యాత్రల్లో మాట్లాడేది అంతా ఒకే వర్గానికి చెందిన వారే నన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నా అన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిగతా నేతలు పీతల్లా పని చేయనీయడం లేదు. పీసీసీ చీఫ్‌కే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీఎం అభ్యర్థిని ప్రకటించగానే.. మిగతా పదకొండు మంది నేతలు పార్టీ వీడతారన్నారు. రాజశేఖర రెడ్డిలా పార్టీకి నేనున్నా అనే నేతలు ఒక్కరైనా ఉన్నారా? అని దానం ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి తర్వాత దృష్టిని కేంద్రీకరించింది కేసీఆర్ మాత్రమేనని, నేనేప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్‌ను దూషించ లేదని దానం తెలిపారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కావొచ్చు, పథకాలు కావొచ్చు.. రాజశేఖర రెడ్డి తరహాలోనే కేసీఆర్ బీసీల కోసం పని చేస్తున్నారన్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చేందుకు పథకాలు ప్రవేశపెట్టారని దానం తెలిపారు. కేసీఆర్ నాకెలాంటి హావిూ ఇవ్వలేదని దానం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పదవి నాకు సిద్ధంగా ఉందిని, కానీ బీసీల సంక్షేమం కోసం తాను పార్టీ మారుతున్నట్టు చెప్పారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే విషయాన్ని తాను 6 నెలల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు, ఆయన కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అడిగినట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యే నిర్వహించిన బస్సు యాత్రపై కూడా ఆయన
విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే బస్సుయాత్రలో ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు.
కాంగ్రెస్‌లో బీసీలకు ప్రాధాన్యతలేదు..




